కొండపి: జరుగుమల్లి మండలం పాలేరు వంతెన సమీపంలో ఆటోని ఢీ కొట్టిన లారీ, ఇద్దరికీ తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు
ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం పాలేరు వంతెన సమీపంలోని 16 నెంబర్ జాతీయ రహదారిపై లారీ ఆటో ఢీకొన్న సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరికీ తీవ్రగాయాలు కావడంతో అంబులెన్స్ లో పోలీసులు ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. జరిగిన ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు.