దర్శి: దొనకొండ మండల కేంద్రంలో ఆనంద ఆశ్రమం నందు బ్రహ్మంగారి ద్వాదశ వార్షిక కళ్యాణ గురు పూజ మహోత్సవం
Darsi, Prakasam | Apr 22, 2026 ప్రకాశం జిల్లా దొనకొండ మండల కేంద్రంలో ఆనంద ఆశ్రమం నందు బ్రహ్మంగారి ద్వాదశ వార్షిక కళ్యాణ గురు పూజ మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమ అధిపతి భైరవానంద స్వామి మాట్లాడుతూ బ్రహ్మంగారి దేవాలయం నిర్మాణం చేపట్టి పుష్కరకాలమైందని 12 సంవత్సరాలకు ఒకసారి మహా కుంభాభిషేకం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నూతన విగ్రహాలను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తులతెరిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.