యర్రగొండపాలెం: ఎర్రగొండపాలెం లో రేపు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై కీలక సమావేశం ఉంటుందని తెలిపిన ఎమ్మెల్యే చంద్రశేఖర్
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం లోని అంబేద్కర్ ఆడిటోరియంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై కీలక సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ తెలిపారు. ఓటర్ల లిస్టు సవరణలో భాగంగా బిఎల్వో లు కీలకంగా వ్యవహరించాలన్నారు. సంబంధిత బిఎల్ఓ లకు కీలక సూచనలతో పాటు దిశా నిర్దేశం చేయనున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని బిఎల్ఓలు, క్లస్టర్ ఇంచార్జీలు ముఖ్య నాయకులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.