ఉరవకొండ: ఉగాది ఉత్సవాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ఉత్తమ రైతు అవార్డు అందుకున్నమొరుసు ఎర్రి స్వామి
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం తగ్గుపర్తి గ్రామానికి చెందిన రైతు మొరుసు ఎర్రిస్వామికి గురువారం విజయవాడలో జరిగిన ఉగాది ఉత్సవాల్లో ఉత్తమ రైతు అవార్డును ముఖ్యమంత్రి శ్రీ. నారా. చంద్రబాబు నాయుడు గారి చేతులమీదుగా అందుకున్నారు. వివిధ రకాల పంటలు సాగుతో పాటు పప్పు సెనగ సాగులో ఆదర్శ దిగుబడిన సాధించడంతో ఉత్తమ రైతు అవార్డును సీఎం చేతుల మీదుగా అందుకున్నారు. ఉత్తమ రైతు అవార్డు తన బాధ్యతను మరింత పెంచిందని రైతు ఎర్రిస్వామి పేర్కొన్నారు.