గిద్దలూరు: కొమరోలు మండలం బాధనేనిపల్లి గ్రామం వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి మధు అనే వ్యక్తి మృతి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
మార్కాపురం జిల్లా కొమరోలు మండలం బాబినేనిపల్లి గ్రామం వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి మధు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నాగరాజు తెలిపారు. మధు భార్య అయిదు రోజుల క్రితమే కూతురికి జన్మ ఇచ్చినట్లుగా గ్రామస్తులు తెలిపారు. అంతేకాకుండా మధు కొంతకాలంగా టిడిపి కార్యకర్తగా చురుగ్గా పార్టీ కార్యక్రమాలలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. పలువురు నాయకులు మధుకు నివాళులు అర్పించారు.