మార్కాపురం: ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ మంజూరు చేయాలని నిర్వాసితుడు శేషయ్య కలెక్టర్ విజయ సునీతకు వినతి
వెలుగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల నిర్వాసితుల గోడు వర్ణనాతీతం. మార్కాపురం మండలం గొట్టిపడియ గ్రామానికి చెందిన శేషయ్య ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ విజయ సునీత కు వినతి పత్రం అందజేశారు. శేషయ్య మాట్లాడుతూ... ముంపు గ్రామమైన తమ పొలాలు ఇండ్లు ప్రాజెక్టుకు ఇచ్చామన్నారు. మొదట లిస్టులో తమ పేరు వచ్చిందని ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ లిస్టులో పేరు తొలగించినట్లు తెలిపారు. న్యాయం చేయాలని కోరారు