యర్రగొండపాలెం: ఎర్రగొండపాలెం లో అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న టిడిపి ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో టిడిపి ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతదేశానికి సమానత్వం న్యాయం స్వేచ్ఛ అనే విలువలను అందించిన మహానుభావుడని అన్నారు. పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం జీవితాంతం పోరాటం చేసిన గొప్ప నాయకుడు అన్నారు.