రాయదుర్గం: మురికిగా వస్తున్న తాగునీటి పై సిద్దేశ్వర కాలనీ వాసుల ఆందోళన, మంచినీరు విడుదల చేయాలని డిమాండ్
రాయదుర్గం పట్టణంలోని 30వ వార్డు సిద్ధేశ్వర కాలనీలో సరఫరా అవుతున్న నీరు తాగడానికే కాదు, వాడుకోవడానికీ పనికిరాకుండా మురికిగా వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికుల అభ్యర్థన మేరకు నిన్న విడుదల చేసిన నీటిని బీజేపీ జిల్లా నాయకులు జీవీ నాయుడు, వాల్మీకి పవన్ కుమార్ తదితరులు పరిశీలించారు. నీరు అత్యంత మురికిగా ఉన్నట్లు వారు గుర్తించారు.“నీరు రావడమే గగనం. వచ్చిన నీరూ ఇలా మురికిగా వస్తే ఎలా?” అని అధికారులను వారు ప్రశ్నించారు. ఈ కలుషిత నీటి వల్ల పిల్లలు, మహిళలు, వృద్ధులు అనారోగ్యాల పాలవుతున్నారని, తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కాలనీవాసులు వాపోయారు.