ఉరవకొండ: గ్రూప్ -2 లో ప్రతిభ ను చాటి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కొలువు సాధించిన గంగవరం గ్రామానికి చెందిన యర్రం వినోద్ కుమార్
అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలం గంగవరం గ్రామానికి చెందిన యర్రం వెంకటరమణ కుమారుడు యర్రం వినోద్ కుమార్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జరిపిన గ్రూప్ 2 పోటీ పరీక్షల్లో ప్రతిభను చాటి ఎక్సైజ్ ఇన్స్స్పెక్టర్ గా కొలువు సాధించడంపై గ్రామస్తులు ఆదివారం హర్షం వ్యక్తం చేశారు. ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గారి చేతుల మీదుగా నియామక ఉత్తర్వులు అందుకోవడం విశేషం అని రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన యర్రం వినోద్ కుమార్ కి మరియు వారి తల్లితండ్రులకు గంగవరం గ్రామ ప్రజలు శుభాభినందనలు తెలిపారు.