మార్కాపురం: కంకర రోడ్డు తో ఇబ్బందులు పడుతున్న వెలుగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల నిర్వాసితులు
మార్కాపురం మండలం జమ్మనపల్లి గ్రామం నుండి పుచ్చకాయ పల్లి వరకు రోడ్డు అద్వానంగా ఉంది. పాత తారు రోడ్డు తొలగించి కంకర వేసి వదిలేశారు. దీంతో వాహనదారులు, ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వెలుగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల నిర్వాసితులు నిత్యం రాకపోకలు సాగించడంతో తీవ్ర అవస్థలు పడుతున్నామన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.