రాయదుర్గం: పట్టణంలోని మటన్ మార్కెట్ లో లీగల్ మెట్రాలజీ అధికారుల తనిఖీలు, తూకాల్లో మోసం చేస్తున్న 7 మందికి జరిమానా
రాయదుర్గం పట్టణంలోని మటన్ మార్కెట్ శుక్రవారం లీగల్ మెట్రాలజీ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గుంతకల్లు డివిజన్ లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ శంకర్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. చేతి త్రాసు వాడుతూ తూకాల్లో వినియోగదారులను మోసం చేస్తున్న 7 మంది కి వెయి వెయ్యి రూపాయలు చొప్పున జరిమానా విధించారు. తనిఖీలు జరుగుతున్నాయన్న సమాచారంతో పలువురు మటన్ కొట్టు నిర్వాహకులు అక్కడ నుంచి నెమ్మదిగా జారుకున్నారు. ఈ సారి తమ నుంచి తప్పించుకోవచ్చునేమో గానీ మరో సారి ఆదివారం, మంగళవారం సమయాల్లో తమ నుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు.