కళ్యాణదుర్గం: బోరంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పాలీసెట్ శిక్షణ ప్రారంభం
కళ్యాణదుర్గం మండలం బోరంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సోమవారం పాలీసెట్ శిక్షణ ప్రారంభమైంది. కళాశాల ప్రతినిధి మస్తాన్ శిక్షణను ప్రారంభించారు. ఈ సందర్భంగా మస్తాన్ మాట్లాడారు. పాలిటెక్నిక్ కు ఆదరణ పెరుగుతున్నదన్నారు. పాలిటెక్నిక్ కోర్సు పూర్తి చేస్తే ఉద్యోగ అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయన్నారు. అందుకే శిక్షణకు అభ్యర్థులు భారీగా వచ్చే అవకాశం ఉందన్నారు.