కళ్యాణదుర్గం: ఎన్ వెంకటాం పల్లిలో తీవ్ర తాగునీటి ఎద్దడి, కర్ణాటక సరిహద్దుకు వెళ్లి తాగునీటిని తెచ్చుకుంటున్న గ్రామస్తులు
కుందుర్పి మండలం ఎన్ వెంకటాం పల్లి లో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. గత కొన్ని రోజులుగా తాగునీటి కోసం గ్రామంలోని ఎస్సీ కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామపంచాయతీ, మండల పరిషత్ అధికారులకు తాగునీటి సమస్య గురించి గ్రామస్తులు తెలియజేశారు. అయినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. గ్రామస్తుల కొందరు కర్ణాటక సరిహద్దుకు వెళ్లి ఫిల్టర్ వాటర్ కొని తెచ్చుకుంటున్నారు. ఈ గ్రామంలో పలువురు గ్రామస్తులు శనివారం మాట్లాడారు. అధికారులు వెంటనే స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.