విశాఖపట్నం: అర్జున అవార్డు అందుకున్న విశాఖ అథ్లెట్ జ్యోతి యర్రాజీ
విశాఖ ఒలింపియన్ జ్యోతి యర్రాజీకి అర్జున అవార్డు లభించింది. ఢిల్లీలో కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ చేతుల మీదుగా జ్యోతి అవార్డును స్వీకరించారు. ఏపీ నుండి ఈ విభాగంలో అర్జున అవార్డు అందుకున్న మొదటి మహిళా అథ్లెట్‌గా జ్యోతి యర్రాజీ గుర్తింపు పొందారు.