మార్కాపురం: సీఎం చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా మెగా జాబ్ మేళా నిర్వహించిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి
మార్కాపురం జిల్లా కేంద్రంలో సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులు జిల్లా కలెక్టర్ విజయ సునీత రిబ్బన్ కత్తరించి ప్రారంభించారు. నిరుద్యోగులకు 4000 జాబ్స్ కల్పించేందుకు సుమారు 72 కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. సుమారు 2500 పైగా నిరుద్యోగులు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు స్కిల్ డెవలప్మెంట్ అధికారులు తెలిపారు