దర్శి: ప్రభుత్వ గ్రంథాలయాన్ని పాత ఎమ్మార్వో కార్యాలయంలోకి మార్చాలని ఎమ్మార్వో శ్రవణ్ కుమార్ ఆదేశం
ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో గత 25 ఏళ్లుగా అద్దె భవనంలో పట్టణానికి దూరంగా ఉన్న ప్రభుత్వ గ్రంథాలయాన్ని ప్రధాన కూడలిలోని పాత ఎమ్మార్వో కార్యాలయంలోకి మార్చాలని ఎమ్మార్వో శ్రవణ్ కుమార్ ఆదేశించారు. గ్రంథాలయం విద్యార్థులకు విజ్ఞాన గని అని ఇది డిగ్రీ ఇంటర్ విద్యార్థులకు ఎంత ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. అద్దె భవనంలో ఇబ్బందులను గమనించి విద్యార్థులకు అందుబాటులో ఉండే విధంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.