రాయదుర్గం: పదోతరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ చూపిన కళ్ళీమఠం ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు అభినందన
పదోతరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు అధ్యాపకులు, పాఠశాల పేరెంట్స్ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. రాయదుర్గం పట్టణంలోని కళ్ళీమఠం ప్రభుత్వ పాఠశాలలో బుధవారం జరిగిన కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, తాజున్ బీ, పేరెంట్స్ కమిటీ చైర్మన్ కె పాయ్వతి, వైస్ చైర్మన్ దాసరి సత్యనారాయణ కమిటీ సభ్యులు మాట్లాడుతూ విద్యార్థులను అభినందించారు. విద్యార్థులకు మెమొంటోలు అందజేసి ఘనంగా సత్కరించారు. ఉన్నత చదువులు చదివి పాఠశాలకు తల్లిదండ్రులకు పేరుప్రఖ్యాతలు తేవాలని సూచించారు. పలువురు అధ్యాపకులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.