దర్శి: దర్శి పురపాలక సంఘ పరిధిలో నామమాత్రంగా దర్శనమిస్తున్న చలివేంద్రాలు
Darsi, Prakasam | Apr 21, 2026 ప్రకాశం జిల్లా దర్శి పురపాలక సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాలు నామమాత్రంగానే దర్శనమిస్తున్నాయి. పది రోజుల క్రితం ప్రారంభించిన విషయం తెలిసినదే. కానీ చాలా చోట్ల తాగునీటి సౌకర్యం కల్పించకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఎండ తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్న దృష్ట్యా అధికారులు స్పందించి చలివేంద్రాలలో పూర్తిస్థాయిలో నీటిని అందుబాటులో ఉంచాలని కోరారు.