కొండపి: ఇంటెలిజెన్స్ డిఎస్పి శ్రీరామ్ మృతిపై విచారం వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపిన మంత్రి స్వామి
ప్రకాశం జిల్లా ఇంటెలిజెన్స్ డిఎస్పి శ్రీరామ్ మృతి పై ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి విచారం వ్యక్తం చేశారు. గురువారం ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్న డిఎస్పి శ్రీరామ్ గుండెపోటుతో మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులకు స్థానం సానుభూతి సంతాపం తెలుపుతున్నట్లు మంత్రి అన్నారు. సివిల్ సిఐగా గిద్దలూరు, దర్శి, పొదిలి, కందుకూరు, చీరాల ప్రాంతాలలో శ్రీరామ్ విధులు నిర్వహించారు. ఆయన సేవలు వెలకట్టలేనివి అని మంత్రి స్వామి తెలిపారు.