గిద్దలూరు: పెరిగిన తీవ్ర ఉష్ణోగ్రతలతో అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న వాహనదారుల అవస్థలు
మార్కాపురం జిల్లాలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న వాహనదారులు తీవ్ర ఉష్ణోగ్రతలతో ఇబ్బందులు పడుతున్నారు. వాహన ఇంజన్లు వేడెక్కిపోయి కొన్నిసార్లు ఆగిపోతున్న సందర్భాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరో 10 రోజులపాటు ఇదేవిధంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.