రాయదుర్గం: సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లో నీరు పుష్కలంగా ఉంది, తాగునీటికి ఇబ్బంది లేదు : టిడిపి టౌన్ ఇన్చార్జ్ టంకశాల హనుమంతు
మరో వంద రోజులకు అవసరమైన తాగునీరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లో ఉందని రాయదుర్గం వాసులు ఎవరూ ఆందోళన చెందవద్దని TDP టౌన్ ఇన్చార్జ్ టెంకశాల హనుమంతు కోరారు. ఇటీవల పట్టణంలో తాగునీటి కోసం జనం దర్నాలు చేపడుతున్న నేపథ్యంలో కణేకల్లు వద్ద ఉన్న సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ను మాజీ కౌన్సిలర్లు, వార్డు ఇన్చార్జ్ లతో కలిసి మంగళవారం పరిశీలించారు. అదనంగా మరో 4 బోర్లు వేసి నీటి పంపింగ్ చేసి నిల్వ చేసుకునేలా MLA ఆదేశాలిచ్చారన్నారు. శివారు ప్రాంతాలకు ట్యాంక్ లు ఏర్పాటు చేసి సరఫరా జరిగేలా చర్యలు తీసుకుంటామని, ఆ యా వార్డులలో టిడిపి ఇన్చార్జ్ లు ప్రజలకు నచ్చజెప్పి సమస్య లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.