దర్శి: తూర్పు గంగవరం గ్రామంలో జడ్పీహెచ్ పాఠశాలలో అసంపూర్తిగా నిలిచిపోయిన అదనపు గదుల నిర్మాణం
Darsi, Prakasam | Jun 22, 2026 ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం తూర్పు గంగవరం గ్రామంలో జడ్పీహెచ్సీ పాఠశాల అదనపు గదులు నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోయాయి. గత ప్రభుత్వంలో నాడు నేడు కింద నిర్మాణం చేపట్టి పూర్తి చేయకుండా సంపూర్తిగా వదిలేశారు. ప్రభుత్వం మారడంతో నిరుపయోగంగా మారిపోయింది. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం నిలిచిపోయిన బిల్డింగును పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని తల్లిదండ్రుల కోరారు.