దర్శి: దొనకొండ మండలంలోని ప్రజలకు పలు సూచనలు చేసిన మండల వ్యవసాయ అధికారి బాలకృష్ణ నాయక్
Darsi, Prakasam | May 31, 2026 ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలోని ప్రజలకు ఎరువుల మందుల దుకాణదారులకు మండల వ్యవసాయ అధికారి బాలకృష్ణ నాయక్ పలు సూచనలు చేశారు. గడ్డిని నాశనం చేసే మందును తాత్కాలికంగా నిషేధించడం జరిగిందన్నారు. దుకాణదారులు ఈ విషయాన్ని గమనించి గడ్డి మందును ఎవరు విక్రయించరాదని హెచ్చరించారు. అదేవిధంగా రైతులకు కూడా గమనించి ఎవరు కొనుగోలు చేయవద్దని సూచించారు. ఇప్పటికే దుకాణాలలో నిల్వ ఉన్న మందును రికార్డులలో నమోదు చేయడం జరిగిందన్నారు. ఉన్నత అధికారులు ఆదేశాలు ఇచ్చేంతవరకు ఎవరు విక్రయించవద్దన్నారు.