రాయదుర్గం: ఎమ్మెల్యే ఆదేశాలు బేఖాతర్, పట్టణంలో తాగునీటి కోసం మరోసారి ఖాళీ బిందెలతో రోడ్డెక్కి మహిళల ధర్నా
రాయదుర్గం పట్టణంలో తాగునీటి సమస్య పరిష్కారం కాకపోవడంతో మహిళలు మరోసారి రోడ్డెక్కి నిరసన తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు ఇటీవల మున్సిపల్, విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని, నిర్లక్ష్యం వహిస్తే శాఖ పరమైన చర్యలకు వెనుకాడనని హెచ్చరించినా ఫలితం లేకపోయింది. సోమవారం మద్యాహ్నం అంబేడ్కర్ నగర్‌కు చెందిన మహిళలు, స్థానికులు ఖాళీ బిందెలతో గుమ్మగట్ట రహదారిపై బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. తమ కాలనీలో గత 10 రోజులుగా తాగునీరు సరఫరా కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.