గిద్దలూరు: గిద్దలూరు మండలంలో ఎస్టీ కమిషన్ చైర్మన్ జోజి రెడ్డి పర్యటన, స్థానిక ఎస్టీల సమస్యలు తెలుసుకున్న చైర్మన్
మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలంలో ఎస్టీ కమిషన్ చైర్మన్ జోజి రెడ్డి శుక్రవారం పర్యటించారు. క్రిష్టం శెట్టిపల్లి, దిగువమెట్ట ప్రాంతాలలోని ఎస్టీలతో చైర్మన్ మాట్లాడారు. ఎస్టీల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని జోజి రెడ్డి అన్నారు. అధికారులు మనకు ఎవరు శత్రువులు కారని మన సమస్యల పరిష్కారానికి వారు ఉన్నారని అన్నారు. కొందరు స్థలాలు లేవని తన దృష్టికి తీసుకువచ్చారని వారికి న్యాయం జరిగేలా చూస్తానని ఆయన అన్నారు.