మార్కాపురం: ప్రజా సమస్యలను పరిష్కరించడమే ప్రభుత్వ ధ్యేయంగా పనిచేస్తున్నట్లు తెలిపిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి
ప్రజా సమస్యలను పరిష్కరించడమే ప్రభుత్వ ధ్యేయంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. మార్కాపురం ఓ కళ్యాణమండపంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 76 అర్జీలు వచ్చాయన్నారు. వాటిని త్వరగా పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ విజయ సునీత పాల్గొన్నారు.