తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జే సీ ప్రభాకర్ రెడ్డి దంపతుల పెళ్లిరోజును పురస్కరించుకొని వారు జీవితాంతం ఆరోగ్యంగా ఉండాలని శనివారం అభిమానులు కిరణ్, రఘు తదితరులు ఆధ్వర్యంలో వేద పండితులు ప్రత్యేక యాగం చేశారు. సుమారు రెండు గంటల పాటు యాగం నిర్వహించారు. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.