మార్కాపురం: ఎమ్మార్వో కార్యాలయంలో జగ్జీవన్ రాం జయంతి వేడుకలు నిర్వహించిన ఎమ్మార్వో చిరంజీవి
మార్కాపురం ఎమ్మార్వో కార్యాలయంలో సంఘసంస్కర్త జగ్జీవన్ రాం జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మార్వో చిరంజీవి ఆయన చిత్రపటానికి పూలను వేసి ఘన నివాళులర్పించారు. విద్యార్థి దశ నుండే అణగారిన వర్గాలకు మేలు చేసేందుకు పట్టుదలతో ఎన్నో పదవులను సాధించారన్నారు. పార్లమెంటులో 40 ఏళ్ల పాటు వివిధ మంత్రి పదవులను నిర్వహించడమే కాకుండా ఉప ప్రధానిగా కూడా పని చేశారన్నారు. కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.