కొండపి: మాజీ మంత్రి బాలినేని పై చేసిన ఆరోపణలపై తీవ్రంగా స్పందించిన జనసేన నాయకురాలు రాయపాటి అరుణ
ప్రకాశం జిల్లా జనసేన పార్టీలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగింది. జనసేన ప్రచార కార్యదర్శి జాడ బాలనాగేంద్ర ఈ రోజు చేసిన వ్యాఖ్యలపై పార్టీ శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఇతరులకు గోతులు తీసే పనులు మానుకోవాలని, లేకుంటే ఆ గోతిలోనే గోతులు తీసేవాళ్లు పడతారని జనసేన మహిళా నాయకురాలు రాయపాటి అరుణ ఘాటుగా హెచ్చరించారు. కుట్రలు, కుతంత్రాలు ఇక సాగవని ఆమె స్పష్టం చేశారు.