దర్శి: కురిచేడు మండలం అగ్రహారం గ్రామంలో వరిగడ్డికి నిప్పు పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు
Darsi, Prakasam | Apr 18, 2026 ప్రకాశం జిల్లా కురిచేడు మండలం ఎన్ ఎస్ పి అగ్రహారం గ్రామంలో వరిగడ్డి వాము గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో దగ్ధమైపోయింది. దీంతో 30 వేల రూపాయల నష్టం జరిగిందని రైతు గోపి తెలిపారు. గమనించిన గ్రామస్తులు మంటలను ఆరిపేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే పూర్తిగా దగ్ధం అయిపోయిందని వారన్నారు.