కొండపి: కొండపి పొగాకు వేలం కేంద్రంలో 183 పొగాకు బెల్లు కొనుగోలు,184 పొగాకు బెల్లు తిరస్కరణ,ఆవేదన వ్యక్తం చేస్తున్న పొగాకు రైతులు
ప్రకాశం జిల్లా కొండపి పొగాకు వేలం కేంద్రంలో గుర్రప్పడియ, మూగచింతల, కే. అగ్రహారం గ్రామాల రైతులు 367 పొగాకు బేళ్లు అమ్మకానికి తీసుకువచ్చారు. 183 బేళ్లు కొనుగోలు చేయగా 184 బేళ్లు తిరస్కరించారు. వేలం కేంద్రం ప్రారంభం నుంచి ప్రతిరోజు తిరస్కరణల సంఖ్య అధికంగా ఉండడంతో రైతులు ఆందోళన చేపట్టారు. తమ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆత్మహత్య లే శరణ్యమని రైతులు వాపోయారు.