దర్శి: మారెళ్ళ గ్రామంలో దైవ వృక్షాన్ని పరిశీలించిన బ్రహ్మంగారిమఠం సిద్ధాంతి జనార్ధన శివాచార్య
ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం మారేళ్ల గ్రామంలో దైవ వృక్షంగా భావిస్తున్న రావి చెట్టును కడప జిల్లా బ్రహ్మంగారిమఠం సిద్ధాంతి జనార్ధన శివాచార్య పరిశీలించారు. గ్రామ పెద్దలు భక్తులతో కలిసి చెట్టు వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఆ ప్రాంతాన్ని పరిశీలించిన ఆయన ఆధ్యాత్మిక ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని అక్కడ ఆలయ నిర్మాణానికి అనుకూలంగా ఉందని సూచించినట్లు గ్రామస్తులు తెలిపారు.