యర్రగొండపాలెం: కొర్రపోలు గిరిజన గూడెంలో తాగునీటి సమస్యను పరిష్కరించిన టిడిపి ఇన్చార్జి ఎరిక్షన్ బాబు
మార్కాపురం జిల్లా దోర్నాల మండలం కొర్రపోలు గిరిజన గూడెంలో తాగునీటి సమస్య పరిష్కారానికి బోరు వేసే కార్యక్రమం ప్రారంభించారు. ఇటీవల అక్కడ పర్యటించిన టిడిపి ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్ బాబుకు స్థానికులు తమ నీటి కష్టాలను తెలియజేశారు. స్పందించిన ఆయన వెంటనే ఇచ్చిన హామీ మేరకు పనులను చేపట్టారు. ఎన్నాళ్ళగాను ఉన్న సమస్య తీరడంతో గిరిజన గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు