తాడిపత్రి: మైనర్లు వాహనాలు డ్రైవ్ చేయకూడదు, మత్తు పదార్థాల జోలికి వెళ్ళకూడదు: తాడిపత్రిలో ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి
మైనర్లు వాహనాలు డ్రైవ్ చేయకూడదు, మత్తు పదార్థాల జోలికి వెళ్లకూడదని తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి, అర్బన్ సీఐ ఆరోహణరావులు అన్నారు. తాడిపత్రిలోని అర్బన్ పోలీస్ స్టేషన్లో శనివారం వజ్ర ప్రహార్ లో భాగంగా స్టాప్ మైనర్ డ్రైవింగ్, మత్తుపదార్థాలపై అవగాహన కల్పించారు. మైనర్లు వాహనాలు నడిపితే వాహనాలు సీజ్ చేయడంతో పాటు మైనర్లకు సంబంధించిన తల్లిదండ్రుల పైన కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పిల్లలు మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులు పోయి ఉందన్నారు.