దర్శి: దర్శి లో తప్పిపోయిన బాలుడిని తల్లిదండ్రుల చెంతకు చేర్చిన దర్శి పోలీసులు
Darsi, Prakasam | Apr 19, 2025 దర్శిలో శనివారం బాలుడు తప్పిపోయిన విషయం తెలిసిందే. పోలిస్ శాఖ వారి అనుమతి మేరకు సోషల్ మీడియాలో బాలుడు తప్పిపోయాడని కథనానికి బాలుడుని గుర్తించిన తల్లిదండ్రులు దర్శి పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చారు. స్థానిక ఏఎస్ఐ ఆరికాటి రాంబాబు దర్శి ఎస్ఐ అనుమతితో బాలుడిని అతని తండ్రికి అప్పగించారు. బాలుడి తండ్రి పోలీసులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.