రాయదుర్గం: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గుమ్మగట్ట రాజన్న చికిత్స పొందుతూ మృతి
గుమ్మగట్ట గ్రామానికి చెందిన కూరాకుల రాజన్న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. గత 10 రోజుల క్రితం అనంతపురానికి బైక్ పై వెళుతుండగా హనిమిరెడ్డిపల్లి వద్ద ఉపాధ్యాయులు వెళుతున్న క్రూజర్ వాహనం బైక్ ను డీకొనింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా అనంతపురం సవేరా ఆసుపత్రికి ఆ తర్వాత బెంగళూరు కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి బుధవారం తెల్లవారుజామున మరణించాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.