యర్రగొండపాలెం: త్రిపురాంతకం గ్రామ సచివాలయంలో మండల స్పెషల్ ఆఫీసర్లతో సమావేశం నిర్వహించిన టిడిపి ఇన్చార్జి ఎరీక్షన్ బాబు
మార్కాపురం జిల్లా త్రిపురాంతకం గ్రామ సచివాలయంలో మండల స్పెషల్ ఆఫీసర్లు పంచాయితీ కార్యదర్శులతో టిడిపి ఇన్చార్జి ఎరిక్షన్ బాబు సమావేశం నిర్వహించారు. గ్రామాల అభివృద్ధి ప్రజల సమస్యలు పరిష్కారం, ముఖ్యంగా వేసవి కాలంలో తాగునీటి సమస్యలను దృష్టిలో ఉంచుకోవాలని తదితర అంశాలపై చర్చించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందేలా పనిచేయాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమంలో మండలంలోని అధికారులు పాల్గొన్నారు