రాయదుర్గం: తాను పార్టీ మారే ప్రసక్తేలేదని స్పష్టం చేసిన వైసీపీ ఎస్ఈసి మెంబర్ గౌని ఉపేంద్రారెడ్డి
తాను పార్టీ మారే ప్రసక్తేలేదని, కట్టె కాలే వరకూ వైసిపిలోనే ఉంటానని ఆపార్టీ SEC మెంబర్ గౌని ఉపేంద్రారెడ్డి స్పష్టం చేశారు. మంత్రి బిసి జనార్దన్ రెడ్డితో కలసి మంతనాలు జరిపిన విషయంపై వచ్చినవార్త కథనంపై ఆదివారం స్పందించారు. మా కుటుంబానికి మంత్రితో ఉన్న సాన్నిహిత్యంతో కలిశానని ఇందులో రహస్యం ఏమీ లేదన్నారు. తనకు ఎన్నో ఉన్నత పదవులు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి కోసం పని చేస్తానన్నారు.