గిద్దలూరు: బేస్తవారిపేటలో తప్పిపోయిన బాలుడిని సురక్షితంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చిన పోలీసులు
మార్కాపురం జిల్లా బేస్తవారిపేట పట్టణంలో తప్పిపోయి తిరుగుతున్న బాలుడిని పోలీసులు సురక్షితంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. ఆదివారం సాయంత్రం పట్టణంలో తప్పి పోయి తిరుగుతున్న బాలుడిని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు బాలుడిని తమ సంరక్షణలో ఉంచుకొని తల్లిదండ్రులకు అప్పగించినట్లు సోమవారం సాయంత్రం తెలిపారు. పిల్లల పట్ల అశ్రద్ధగా వ్యవహరించకుండా నిరంతరం వారిపై నిగా ఉంచాలని తల్లిదండ్రులకు పోలీసులు సూచిస్తున్నారు.