కళ్యాణదుర్గం: రాష్ట్ర రాజధానిగా అమరావతి పార్లమెంటులో ఆమోదింపబడడంతో కళ్యాణదుర్గంలో టీడీపీ శ్రేణులు బైక్ ర్యాలీ
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి పార్లమెంటులో బిల్లు ఆమోదించబడడంతో కళ్యాణదుర్గంలో గురువారం సాయంత్రం టీడీపీ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రజా వేదిక వద్ద నుంచి ప్రధాన రహదారుల గుండా బైక్ ర్యాలీ నిర్వహించారు. జై అమరావతి, జై చంద్రబాబు నాయుడు అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు.టీ సర్కిల్లో బాణాసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు. జై అమరావతి అనే నినాదాలతో పట్టణం మారుమోగిపోయింది.