రాయదుర్గం: నేత్రపల్లి సహా వివిధ గ్రామాల్లో భక్తిశ్రద్దలతో మెహర్రం వేడుకలు
గుమ్మగట్ట మండలం నేత్రపల్లితో పాటు పలు గ్రామాల్లో మొహర్రం పండుగ వేడుకలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా జరుగుతున్నాయి. నేత్రపల్లి గ్రామంలో సుప్రసిద్ధ వన్నూరు స్వామి పీర్ల చావిడి వద్ద 7వ సరిగెతు సందర్భంగా మంగళవారం రాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పీర్లకు పూల మాలలు సమర్పించి, అన్న ప్రసాదం, చెక్కర ఫతియాలు పంచిపెట్టారు.ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పీర్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. చావిడి వద్ద భక్తి గీతాలు, నైవేద్యాలతో వాతావరణం భక్తిమయంగా మారింది.