రాయదుర్గం: సిఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
ఆపదలో అత్యవసర చికిత్సలు చేయించుకున్న వారికి సిఎం సహాయనిధి ఎంతో ఊరటను ఇస్తోందని రాయదుర్గం ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు పేర్కొన్నారు. శనివారం రాయదుర్గంలో 24 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.13 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. ఇప్పటివరకూ నియోజకవర్గంలో 387 మందికి రూ. 2.58 కోట్లు ముఖ్యమంత్రి సహాయం చేశారని వెల్లడించారు. ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. గుమ్మగట్ట, డి.హిరేహాల్, బొమ్మనహాల్ మండలాల కన్వీనర్ లు కాలువసన్నన్న, మోహన్ రెడ్డి, మల్లెన్న పాల్గొన్నారు.