యర్రగొండపాలెం: ఎర్రగొండపాలెం లో వర్చువల్ మహానాడు కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించిన టిడిపి ఇన్చార్ ఎరిక్షన్ బాబు
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం టిడిపి పార్టీ కార్యాలయంలో వర్చువల్ మహానాడు కార్యక్రమాన్ని టిడిపి ఇన్చార్జి ఎరిక్షన్ బాబు ప్రారంభించారు. కార్యక్రమంలో ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అమరావతిలో ఏర్పాటుచేసిన మహానాడు కార్యక్రమాన్ని స్క్రీన్ లపై ప్రత్యక్షంగా వీక్షించారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని క్లస్టర్ ఇంచార్జీలు తదితరులు పాల్గొన్నారు.