కొండపి: పొన్నలూరు మండల పరిధిలో మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు: పొన్నలూరు ఎస్ఐ
పొన్నలూరు మండలంలో మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే చర్యలు తప్పవని ఎస్ఐ కట్టా అనూక్ హెచ్చరించారు. స్థానిక పోలీస్ స్టేషన్లో మంగళవారం ఆయన మాట్లాడారు. రోడ్డు భద్రత నిబంధనల మేరకు వాహనాలు నడపాలన్నారు. లైసెన్స్ కలిగిఉండి, హెల్మెట్ ధరించాలని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇస్తే వారి తల్లిదండ్రులపైనా చర్యలు తీసుకుంటామన్నారు.