కొండపి: పొన్నలూరు మండల పరిధిలో పేకాట ఆడుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న స్థానిక పోలీసులు
ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలంలో పేకాట ఆడుతున్న ఇద్దరినీ శుక్రవారం స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.2,140 నగదు స్వాధీనం చేసుకొని పేకాట ఆడుతున్న వారిపై కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్సై వెల్లడించారు. అలానే నిందితుల వద్ద నుంచి రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నమని వెల్లడించారు. పేకాట ఆడటం చట్టరీత్యా నేరమని పొన్నలూరు ఎస్సై హెచ్చరిస్తున్నారు.