దర్శి: ముండ్లమూరు మండలం మారేళ్ల గ్రామంలో భీకర గాలులతో భారీ వర్షం
ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం మారేళ్ల గ్రామంలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం పడింది. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు తీవ్రమైన ఎండతో స్థానిక ప్రజలు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. భీకర గాలులు వేస్తూ భారీ వర్షం పడింది. దీంతో ఎలాంటి ఇబ్బంది కలకుండా అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.