మార్కాపురం: జిల్లా కేంద్రంలో లక్ష్మీ చెన్నకేశవ స్వామి చంద్ర వాహనంపై శ్రీమన్నారాయణ మూర్తి అలంకారంలో భక్తులకు దర్శనం
మార్కాపురం జిల్లా కేంద్రంలో వెలిసిన లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా చెన్నకేశవ స్వామి చంద్రప్రభ వాహనంపై శ్రీమన్నారాయణ మూర్తి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. నాలుగు మాడవీదుల గుండా ఊరేగింపు నిర్వహించారు. భక్తుల స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.