కొండపి: జరుగుమల్లి మండలంలో జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ రాజబాబు తో పాటు మంత్రి స్వామి
జరుగుమల్లి మండలంలోని చిరికూరపాడు గ్రామంలో ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి జిల్లా కలెక్టర్ రాజాబాబు సారధ్యంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు మంత్రి స్వామి మరియు కలెక్టర్ పెన్షన్లను అందజేశారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రతినెల సీఎం చంద్రబాబు ఒకటవ తేదీలోపు లబ్ధిదారులకు పెన్షన్లు అందిస్తున్నారని కూటమి ప్రభుత్వం సారథ్యంలో రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుందని మంత్రి అన్నారు.