రాయదుర్గం: మద్యం మత్తులో టిడిపి సోషల్ మీడియా కార్యకర్త వీరంగం, కానిస్టేబుల్ చొక్కా పట్టుకుని బూతులు తిడుతూ దౌర్జన్యం
టీడీపీ సోషల్ మీడియా విభాగం నాయకుడు పోలీసులపై వీరంగం చేసి భయబ్రాంతులకు గురి చేసిన వీడియోలు వైరల్ గా మారాయి. బూతులు తిడుతూ నేను ఎవరో మీకు తెలియదా..? అంటూ కానిస్టేబుల్ చొక్కా పట్టుకుని దుర్భాషలాడిన ఘటన తాలూకు వీడియోలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. గత ఆదివారం రాయదుర్గం జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన కెసిఎల్ క్రికెట్ టోర్నమెంట్ మ్యాచ్ వీక్షించేందుకు యువకులు భారీగా తరలివచ్చారు. కారు అడ్డం ఉంది పక్కకు వెళ్లాలని పోలీసులు సూచించగా వారిపై రెచ్చిపోయి ఈ దుస్సంఘటనకు పాల్పడినట్లు తెలిసింది. మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడమేగాక పోలీసులపైనే దౌర్జన్యం చేయడం చర్చనీయాంశంగా మారింది.