గిద్దలూరు: కంభంలో లారీ డ్రైవర్ మద్యం తాగి పెళ్లి బృందాన్ని ఆటోని ఢీకొట్టగా నలుగురు మృతి, సంఘటనా స్థలాన్ని పరిశీలించిన డి.ఎస్.పి
మార్కాపురం జిల్లా కంభం పట్టణంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై శుక్రవారం లారీ డ్రైవర్ ఫుల్లుగా మద్యం సేవించి పెళ్లి బృందాన్ని ఢీకొట్టాడు. నలుగురు మృతి చెందారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ నాగరాజు మృతుల వివరాలు తెలిపారు. లారీ డ్రైవర్ ఫుల్లుగా మద్యం తాగడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని పెళ్లికూతురు మీడియాకు తెలిపింది. కొద్దిసేపట్లో వివాహం జరగవలసిన ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నప్పుడు డిఎస్పి నాగరాజు తెలిపారు.